మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో హీరోయిన్లుగా కియారా అధ్వాని, అంజలి నటిస్తున్నారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ చార్మినార్ దగ్గర జరుపుకుంటున్నట్లుగా డైరెక్టర్ శంకర్ తెలిపారు.దీనికి సంబంధించిన ఒక ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు శంకర్. ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.