బాలీవుడ్ ప్రేమ పక్షులు సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీల వివాహం ఫిబ్రవరి 7వ తేదీన రాజస్థాన్, జై సల్మేర్ సూర్యఘర్ కోటలో, కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం జరిగిన రోజు రాత్రే తమ వివాహా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, అభిమానుల ప్రేమ, ఆశీర్వాదం కావాలని కోరుకున్నారు. కొత్త జంటకు అభిమానులు, సెలెబ్రిటీలు అందరూ ... హార్దిక శుభాకాంక్షలు తెలియచేసారు.
పెళ్ళైన మూడు రోజులకు కియారా, సిద్దార్థ్ లు ఇద్దరూ తమ వివాహానికి సంబంధించిన చిన్న వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసి, ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేసారు. కలలో జరిగినట్టుగా జరిగిన వీరిద్దరి వివాహాన్ని చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.