హీరోయిన్ హన్సిక ఇటీవల వ్యాపారవేత్త సోహైల్ ను వివాహం చేసుకున్నారు. అయితే, అతన్ని పెళ్లి చేసుకునే వరకు సీక్రెట్ గా ఉంచాలనుకున్నామని, కానీ మీడియాకు లీక్ కావడంతో తమ ఫోటోలు షేర్ చేసినట్లు చెప్పారు. సోహైల్ కు అప్పటికే పెళ్లి అయ్యిందని, అతను డైవర్స్ తీసుకోవడానికి తనే కారణమంటూ కొందరు వార్తలు రాశారని ఆవేదన వ్యక్తం చేశారు. అతని గతం తెలిసినప్పటికీ, డైవర్స్ తీసుకోవడానికి తనకు సంబంధం లేదన్నారు.