ఇప్పటికే మూడు లిరికల్ సాంగ్స్ ను విడుదల చేసి, శ్రోతలను అలరిస్తున్న "వినరో భాగ్యము విష్ణుకథ" సినిమా నుండి తాజాగా నాల్గవ లిరికల్ సాంగ్ విడుదల కాబోతుంది. సినిమా కథానేపథ్యం తిరుపతిలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో తిరుపతిలోనే నాల్గవ లిరికల్ 'తిరుపతి' సాంగ్ ను విడుదల చెయ్యబోతున్నారు మేకర్స్. ఈ మేరకు రేపు రాత్రి ఏడు గంటల నుండి ఇందిరా మైదానం, తిరుపతిలో వినరో భాగ్యము విష్ణుకథ సినిమా నుండి తిరుపతి లిరికల్ వీడియో సాంగ్ విడుదల కాబోతుందని, మేకర్స్ స్పెషల్ పోస్టర్ ద్వారా తెలియచేసారు.