కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ కలెక్షన్స్ రాబట్టిన "లవ్ టుడే" మూవీ ఈ రోజుతో విజయవంతమైన 100రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. దీంతో చిత్రబృందం సంతోషం వ్యక్తం చేస్తూ, స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది.
అదే టైటిల్ తో తెలుగులో అనువాదమై ఈ చిత్రానికి టాలీవుడ్ ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రదీప్ రంగనాధన్ డైరెక్ట్ చేసి, హీరోగా కూడా నటించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లో ఇవానా హీరోయిన్ గా నటించింది. తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూట్ చేసారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్, సత్యరాజ్ కీరోల్స్ లో నటించారు.