మత్తు వదలరా ఫేమ్ నరేష్ అగస్త్య నటిస్తున్న కొత్త చిత్రం "మెన్ టూ". శ్రీకాంత్ జి రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని లాంటెర్న్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మౌర్య సిద్దవరం నిర్మిస్తున్నారు.
గతంలో విడుదలైన మెన్ టూ వీడియో గ్లిమ్స్ కి ఆడియన్స్ నుండి ప్రత్యేకమైన అభినందనలు రాగా, తాజాగా ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా మేకర్స్ మరొక ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 13న మెన్ టూ టీజర్ విడుదల కాబోతుందని పేర్కొంటూ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు. సీనియర్ నటుడు బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్, రియా సుమన్, ప్రియాంక శర్మ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు.