మంచు లక్ష్మి ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం "అగ్ని నక్షత్రం". వంశీ కృష్ణ మళ్ల దర్శకత్వంలో థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మోహన్ బాబు గారు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఫస్ట్ టైం తండ్రి కూతుళ్లు కలిసి నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.
రీసెంట్గానే షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా నుండి మేకర్స్ స్పెషల్ గ్లిమ్స్ విడుదల చెయ్యడానికి సిద్ధమయ్యారు. వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం 11:07 నిమిషాలకు అగ్ని నక్షత్రం స్పెషల్ గ్లిమ్స్ ను టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి విడుదల చెయ్యబోతున్నారని స్పెషల్ పోస్టర్ ద్వారా మేకర్స్ తెలియచెయ్యడం జరిగింది.
లక్ష్మి ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త బ్యానర్లపై మోహన్ బాబు, మంచు లక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. సముద్రఖని, విశ్వంత్, చిత్ర శుక్ల తదితరులు నటిస్తున్నారు.