ఎప్పుడో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మలయాళం యాక్ట్రెస్ హానీ రోజ్ బాలయ్య సినిమాతో మంచి క్రేజ్ దక్కించుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’ చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు మలయాళం యాక్ట్రెస్ హానీ రోజ్. ఇప్పటికే మలయాళంలో హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకున్నారు. మరోవైపు తమిళం, తెలుగు చిత్రాల్లోనూ అవకాశాలను అందుకుంటున్నారు.
సినిమాలో హానీ రోజ్ చాలా సేపు కనిపిస్తారు. దీంతో ఆమె నటనతో ఆకట్టుకునే ఛాన్స్ లభించింది. తన పాత్రమేరకు అద్భుతంగా నటించి ప్రేక్షకుల హ్రుదయాలను గెలుచుకున్నారు. దీంతో ఒక్కసారిగా తెలుగు ఆడియెన్స్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.ఈ చిత్రం తర్వాత హానీ రోజ్ సోషల్ మీడియాలో నిత్యం కనిపిస్తున్నారు. పలు మాల్స్ ఓపెనింగ్స్ కు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా అదిరిపోయే అవుట్ ఫిట్లలో మెరుస్తూ యువతను మెస్మరైజ్ చేస్తోంది.
మరోవైపు నెట్టింట గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతోంది. తాజాగా హానీ రోజ్ చేసిన ఫొటోషూట్ కుర్ర గుండెల్ని కొల్లగొట్టేలా ఉన్నాయి. గ్లామర్ బ్యూటీ అందాల ధాటికి యువత చిత్తై పోతోంది.ట్రెడిషనల్ మరియు ట్రెండీ వేర్స్ లో అందాల విందు చేస్తున్న హానీ రోజ్ తాజాగా చీరకట్టులో దర్శనమిచ్చారు. గ్రీన్ శారీలో చీరకే అందం తెచ్చింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో టాప్ గ్లామర్ షోతో మతులు పోగొట్టింది. ఈమెరిసిపోయే అందానికి నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.