ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'పఠాన్' లేటెస్ట్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 11, 2023, 04:48 PM

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'పఠాన్' సినిమా హిందీ, తెలుగు మరియు తమిళంలో విడుదలైయింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. కింగ్ ఖాన్ నటించిన పఠాన్ USA బాక్సాఫీస్ వద్ద $14.5 మిలియన్లకు పైగా వసూలు చేసి హిట్‌గా నిలిచింది.


తాజాగా ఇప్పుడు, USA బాక్సాఫీస్ వద్ద $22 మిలియన్లకు పైగా వసూలు చేసిన బాహుబలి 2 తర్వాత 'పఠాన్' ఇప్పుడు USA బాక్సాఫీస్ వద్ద రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. పఠాన్ దాదాపు $17 మిలియన్ల గ్రాస్‌తో మూసివేయబడుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో బ్యూటీ క్వీన్ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుంది. హ్యాండ్సమ్ హంక్ జాన్ అబ్రహం ఈ బిగ్గీలో కీలక పాత్రలో కనిపించనున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa