టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "వినరో భాగ్యము విష్ణుకథ". మహాశివరాత్రి కానుకగా ఈ నెల 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి ముస్తాబవుతుంది. దీంతో ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం అంతా కలిసి ఈ రోజు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అలానే ఈ రోజు రాత్రి ఏడు గంటలకు ఇందిరా స్టేడియం లో జరగబోయే ఈవెంట్లో ఫోర్త్ సింగిల్ 'తిరుపతి' లిరికల్ వీడియోను విడుదల చెయ్యబోతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa