యంగ్ హీరో లక్ష్ చదలవాడ నటిస్తున్న కొత్త చిత్రం "ధీర". కాసేపటి క్రితమే ఫస్ట్ సింగిల్ 'అధరం..మధురం' లిరికల్ ప్రోమో విడుదలయ్యింది. సాయి కార్తీక్ స్వరకల్పనలో రూపొందిన ఈ పాటను స్టార్ సింగర్ అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఫుల్ సాంగ్ ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14 ఉదయం పదకొండు గంటలకు విడుదల కాబోతుంది.
విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో సరికొత్త కధాంశంతో రూపొందుతున్న ఈ సినిమాను చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ పై పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు.ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa