టాలీవుడ్ అందాల రాణి సమంత.. ప్రస్తుతం తన భర్త, హీరో నాగచైతన్యతో కలిసి పెళ్లైన తర్వాత మజిలీ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తర్వాత సమంత తమిళ హిట్ మూవీ ''96'' రీమేక్‌లో నటించేందుకు సిద్ధమవుతుంది. ఇటీవల నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో కనిపించే సమంత నందినీ రెడ్డితో బేబీ అనే సినిమా చేసేందుకు ఒప్పేసుకుంది. అయితే ఈ సినిమా టైటిల్‌లో ఓ చిన్న మార్పు వుంటుందని సినీ యూనిట్ వెల్లడించింది. కొరియన్ మూవీ మిస్ గ్రానీకి ఇది రీమేక్. పైకి యంగ్‌గా కనిపించడానికి తాపత్రయపడే ఓల్డ్ లేడీ పాత్రలో సమంత కనిపించనుంది. ఈ సినిమాకు ఓ బేబీ అనే టైటిల్ పెట్టాలనుకున్నారు. ఎంత సక్కంగున్నావే అనేది ట్యాగ్ లైన్. ఈ ట్యాగ్ లైన్‌లో ఎలాంటి మార్పు లేకపోయినా ఓ బేబీ అనే టైటిల్‌ను బేబీ అని మార్చుతున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa