పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఇప్పటికే రాజా డీలక్స్ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త వైరలవుతోంది. ప్రభాస్ ఈ చిత్రానికి ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని టాక్. కొన్ని కథనాల ప్రకారం సినిమా బడ్జెట్ పరిమితికి మించి పెరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa