ఇప్పుడిప్పుడే సెలబ్రెటీలు తమ అనారోగ్య సమస్యల గురించి చెప్తున్న వేళ తాజాగా రేణూ దేశాయ్ తన ఆరోగ్య పరిస్థితి గురించి ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం తన పరిస్థితి ఏమీ బాగా లేదని, గత కొన్నేళ్ల నుంచి తాను పోరాడుతూనే వస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. గుండె, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, శక్తిని కూడబెట్టుకుని వాటిని ఎదుర్కొంటున్నాని తెలిపింది. తనలా ఎవరైన బాధపడుతుంటే వారంతా ధైర్యంగా పోరాడాలని సూచించింది.