నిన్న విడుదలైన దసరా సెకండ్ సింగిల్ ఓరి వారి హార్ట్ బ్రేక్ యాంథెం కి ఆడియన్స్ నుండి హార్ట్ వార్మింగ్ రెస్పాన్స్ వస్తుంది. ఓరి వారి..నీదిగాదురా పోరి.. అని సాగే ఈ మెలోడీ సాంగ్ ని సంతోష్ నారాయణ స్వరపరచి ఆయనే ఆలపించారు. పక్కా మాస్ హీరోకి క్లాస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తో కంపోజ్ చేసిన ఈ మ్యాజికల్ మెలోడీ యూట్యూబులో 1.5 మిలియన్ వ్యూస్ తో 51కే లైక్స్ తో ట్రెండ్ అవుతుంది.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ సినిమాను సుధాకర్ చేరుకొని నిర్మిస్తున్నారు. దీక్షిత్ శెట్టి కీరోల్ లో నటిస్తున్నారు.