ఇటీవల నటీమణులు సమంత, మమతా మోహన్ దాస్, రేణూదేశాయ్ తమ ఆరోగ్య సమస్యలను వెల్లడించారు. తాజాగా, ఈ జాబితాలోకి నటి అనుష్క శెట్టి చేరారు. ఓ ఇంటర్వ్యూలో తనకున్న వింత సమస్యను వెల్లడించారు. ‘నేను నవ్వడం మొదలుపెడితే 15-30 నిమిషాలు కంట్రోల్ చేసుకోలేను. దీని వల్ల ఇబ్బంది పడుతున్నాను’ అని తెలిపారు. అయితే, ఆమె సరదాగా ఇలా చెప్పిందని కొందరు అంటుండగా, నిజంగానే సమస్య ఉందేమోనని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు.