కరణ్ అన్షుమాన్ మరియు సుపర్ణ్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తన మొదటి వెబ్ సిరీస్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ కి 'రానా నాయుడు' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజా అప్డేట్ ప్రకారం, ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో 10 మార్చి 2023న ప్రీమియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని OTT దిగ్గజం అధికారకంగా వెల్లడించింది.
టాలీవుడ్ హ్యాండ్సమ్ హల్క్ రానా దగ్గుబాటి కూడా వెబ్ సిరీస్ లో కనిపించనున్నారు. ఈ తెలుగు క్రైమ్ డ్రామా సిరీస్లో సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, ఆశిష్ విద్యార్థి, గౌరవ్ చోప్రా, సుచిత్రా పిళ్లై, రాజేష్ జైస్ మరియు ప్రియా బెనర్జీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ క్రైమ్ డ్రామా పాపులర్ అమెరికన్ టీవీ సిరీస్ 'రే డోనోవన్' కి ఆధారంగా రూపొందిస్తున్నారు. లోకోమోటివ్ గ్లోబల్ మీడియా LLPకి చెందిన సుందర్ ఆరోన్ ఈ వెబ్ సిరీస్ ని నిర్మిస్తున్నారు.