వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన "అంటే సుందరానికి" సినిమా విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది కానీ బాక్సాఫీస్ వద్ద రిటర్న్స్ పరంగా ఫెయిల్ అయ్యింది. తాజాగా ఇప్పుడు ఈ కాంబో లో మళ్లీ ఒక సినిమా రానున్నట్లు సమాచారం. అంటే సుందరానికి సినిమా చేస్తున్నప్పుడు వివేక్ వర్కింగ్ స్టైల్ నానికి బాగా నచ్చడంతో దర్శకుడికి మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న నాని30 తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్ట్ను డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తునట్లుగా మరియు త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.