టాలీవుడ్ ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న డీజే టిల్లు మూవీ సీక్వెల్ రీసెంట్గా స్టార్ట్ ఐన విషయం తెలిసిందే. ఈ మేరకు 'టిల్లు స్క్వేర్' టైటిల్ తో మూవీ ఎనౌన్స్మెంట్ టీజర్ కూడా విడుదలైంది. ఇందులో మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుందని మేకర్స్ అఫీషియల్ గా తెలిపారు. అలానే విమల్ కృష్ణ కాదు.. అద్భుతం ఫేమ్ మల్లిక్ రామ్ డీజే టిల్లు సీక్వెల్ కి డైరెక్టర్ గా వ్యవహరిస్తారని తెలిపారు.
ఐతే, డైరెక్టర్ విమల్ కృష్ణ సీక్వెల్ నుండి ఎందుకు తప్పుకున్నారో కారణం బయటకు రాలేదు. దీంతో పలురకాల వార్తలు ప్రచారంలోకొచ్చాయి. ఐతే, ఇప్పుడు ఈ విషయంపై అసలు క్లారిటీ ఇచ్చారు నిర్మాత నాగవంశీ. సూపర్ హిట్ డీజే టిల్లు కి వెంటనే సీక్వెల్ తియ్యాలనే ఇంట్రెస్ట్ విమల్ కి లేదని, డీజే టిల్లు తదుపరి ఒక ఫ్రెష్ ఫిలిం చేయాలన్నది ఆయన ఉద్దేశం.. అంటూ అసలు నిజం బయటపెట్టారు నాగవంశీ.