నిర్మాత, నటుడు బండ్ల గణేష్ చేసిన ఓ ట్వీట్ నెట్టింట హాట్ టాపిక్ గా నిలిచింది. 'మోసం చేయాలనుకునే వాడు మేధావిలా నటిస్తాడు. వంచించాలనుకునేవాడు గురువులా నటిస్తాడు. కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడు భక్తుడుగానే పొగరుగా ఉంటాడు. అది మీకు నచ్చినా నచ్చకపోయినా' అంటూ ఫైర్ ఎమోజీని జత చేశాడు. కాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ను ఉద్దేశించి బండ్ల ఈ ట్వీట్ చేసినట్లు కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.