కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గారి కెరీర్ లో 125వ చిత్రంగా తెరకెక్కిన చిత్రం "వేద". A హర్ష డైరెక్షన్లో పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో గానవి లక్ష్మణ్ హీరోయిన్ గా నటించింది. అర్జున్ జన్య సంగీతం అందించారు. గీత పిక్చర్స్, జీ స్టూడియోస్ సంయుక్త బ్యానర్లపై గీత శివరాజ్ కుమార్ నిర్మించారు.
సక్సెస్ఫుల్ థియేటర్ రన్ పూర్తి చేసుకుని రీసెంట్‌గానే డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన వేదకు ఓటిటి ఆడియన్స్ నుండి విశేష స్పందన వస్తుంది. దీంతో జీ 5 ఓటిటిలో పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న వేద 100మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ని అతి తక్కువ సమయంలోనే పూర్తి చేసింది.