సెలెబ్రిటీలతో నిర్వహింపబడే టాక్ షోలకు ఆడియన్స్ నుండి ఎల్లప్పుడూ అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవలే ప్రారంభమైన డిజిటల్ టాక్ షో 'నిజం విత్ స్మిత' కు ఆడియన్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ వస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి గారితో మొదలైన ఈ షో యొక్క రెండవ ఎపిసోడ్ ఈ రోజు నుండే సోనీ లివ్ ఓటిటిలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ఇక, సెకండ్ ఎపిసోడ్ కి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొని, తన మనోగతాన్ని వెల్లడించినట్టుగా తెలుస్తుంది.