హర్షవర్ధన్ దర్శకత్వంలో ఇన్ బాక్స్ పిక్చర్స్ పతాకంపై అంజుమ్ ఖురేషి, సాజిద్ ఖురేషి నిర్మిస్తున్న చిత్రం "ఇన్ కార్". సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా యొక్క ట్రైలర్ ఈ రోజు విడుదలై, ప్రేక్షకుల మన్ననలను అందుకుంటుంది. ఒక ఇన్నోసెంట్ అమ్మాయి ఆగంతకుల ట్రాప్ లో చిక్కుకుని, తప్పించుకోవడానికి శతవిధాలా ప్రయత్నించే నేపథ్యంతో రూపొందిన ఈ సినిమాలో 'గురు' ఫేమ్ రితికా సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తుంది. సందీప్ గోయట్, మనీష్ ఝున్జూలియా, గ్యాన్ ప్రకాష్ ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా భాషల్లో ఈ మూవీ వచ్చే నెల 3వ తేదీన విడుదల కావడానికి రెడీ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa