ఇటీవల విడుదలైన "మెన్ టూ" మూవీ టీజర్ కి ఆడియన్స్ నుండి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఆడవాళ్ల వల్ల మగవాళ్ళు పడుతున్న ఇబ్బందులు, డిప్రెషన్ నేపథ్యంలో ఫన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాపై ఆడియన్స్ లో ఉన్న పాజిటివ్ వైబ్స్ కారణంగా మార్కెట్ కూడా బాగా జరుగుతుందని తెల్సుతుంది. ఈ నేపథ్యంలో మెన్ టూ ఓవర్సీస్ హక్కులను ఫ్లై హై సినిమాస్ సంస్థ హ్యూజ్ ఎమౌంట్ చెల్లించి కొనుగోలు చేసిందని వినికిడి.
శ్రీకాంత్ జి రెడ్డి డైరెక్షన్లో యువనటుడు నరేష్ అగస్త్య హీరోగా నటించిన ఈ చిత్రంలో బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్, రియా సుమన్, రోహిణి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఎలీషా ప్రవీణ్, ఓషో వెంకట్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa