ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మావీరన్' ఫస్ట్ సింగిల్ కోసం 500మంది డాన్సర్లు

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 18, 2023, 04:44 PM

హీరో శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న న్యూ మూవీ "మావీరన్" నుండి ఫస్ట్ సింగిల్ 'సీనా సీనా' లిరికల్ వీడియో విడుదలైన విషయం తెలిసిందే. శోభి మాస్టర్ కొరియోగ్రఫీలో రూపొందిన ఈ మాస్ డాన్స్ నెంబర్ ఆడియన్స్ ని కనురెప్ప వెయ్యనీయకుండా చేస్తుంది.


విశేషమేంటంటే, ఈ పాట కోసం 500మంది లోకల్ డాన్సర్లను దర్శకనిర్మాతలు తీసుకోవడం. దీంతో లోకల్ డాన్సర్లకు ఉద్యోగాన్ని కల్పించినందుకు డాన్సర్స్ యూనియన్ చిత్ర దర్శకనిర్మాతలను సత్కరించింది. 


మడోన్నా అశ్విన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. అదితి శంకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్ కీ రోల్ లో నటిస్తున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa