మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి యొక్క మలయాళం-తమిళ ద్విభాషా చిత్రం 'నాన్‌పకల్ నేరతు మయక్కం' థియేటర్‌లలో విడుదలై మంచి రన్ సాధించలేకపోయింది. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం ఈ నెల 23 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుందని OTT ప్లాట్‌ఫారమ్ అధికారిక ధృవీకరణను ఇచ్చింది. మలయాళం, తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. లిజో జోస్ పెల్లిస్సేరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రమ్య పాండియన్, అశోక్ మరియు అశ్వత్ అశోక్ కుమార్ ఇతర కీలక పాత్రలు పోషించారు.