నందమూరి తారకరత్న అకాల మరణం కారణంగా నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తమ కొత్త సినిమాలకు సంబంధించిన పనులను వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే.
తాజా సమాచారం ప్రకారం, బాలకృష్ణ వచ్చే నెల 12 నుండి అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న NBK 108 మూవీ సెట్స్ లో అడుగుపెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.
యంగ్ సెన్సేషన్ శ్రీలీల ఈ సినిమాలో బాలయ్య కూతురిగా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మిస్తుంది.