మెగాపవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం RRR ఆస్కార్ ప్రమోషన్స్ నిమిత్తం US లో ఉన్నారు. నిన్న గుడ్ మార్నింగ్ అమెరికా కార్యక్రమంలో పాల్గొని వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచిన చరణ్ ఈ రోజు ABC లో పాల్గొని మరోసారి వార్తల్లో నిలిచారు. ABC అంటే అమెరికన్ బ్రాడ్ క్యాస్టింగ్ టెలివిజన్ నెట్ వర్క్. ఈ కార్యక్రమంలో ABC కరస్పాండెంట్ విల్ రీవ్ తో చరణ్ టాలీవుడ్ సినిమా ప్రాముఖ్యత, నాటు నాటు ఆస్కార్ నామినేషన్ పై మాట్లాడారు. తదుపరి హాలీవుడ్ స్టూడియో ప్రొడ్యూసర్స్ గిల్డ్ ని చరణ్ కలవనున్నారు. ఆపై లాస్ ఏంజెల్స్ లో జరగబోయే ఈవెంట్ లో పాల్గొంటారు.