సార్/వాతి సినిమాలోని మాస్టారూ మాస్టారూ.. వా వాతి పాటకు ఇరు భాషలు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా నిన్న సాయంత్రం ఈ పాట యొక్క రిప్రైజింగ్ వెర్షన్ ని మేకర్స్ విడుదల చేసారు. తమిళంలో ధనుష్ స్వయంగా ఆలపించి, సాహిత్యం అందించిన ఈ పాటను విన్న శ్రోతలు మైమరచిపోతున్నారు. దీంతో ఈపాట విడుదలైన 24 గంటల్లోనే 1 మిలియన్ కు పైగా వ్యూస్ సాధించి యూట్యూబ్ ట్రెండింగ్లో దూసుకుపోతుంది. పోతే, తెలుగులో కూడా ఈ పాటను ధనుష్ పాడారు. రామజోగయ్య శాస్త్రి గారు సాహిత్యం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa