ఇప్పటివరకు సపోర్టింగ్, విలన్, ఫన్నీ రోల్స్ లో రావురమేష్ ప్రేక్షకులను అలరించగా, తాజాగా హీరో అవతారమెత్తారు. విలక్షణ నటుడు రావురమేష్ ప్రధానపాత్రలో, 'మారుతినగర్ సుబ్రహ్మణ్యం' టైటిల్ తో ఈ రోజు ఒక న్యూ మూవీ ఎనౌన్స్మెంట్ జరిగింది. హ్యాపీ వెడ్డింగ్ ఫేమ్ లక్ష్మణ్ కార్య ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. సీనియర్ హీరోయిన్ ఇంద్రజ కీరోల్ లో నటిస్తున్నారు. వచ్చే నెల నుండి ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. PBR సినిమాస్ బ్యానర్ పై సెకండ్ ప్రాజెక్ట్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో రావురమేష్ నడివయసు నిరుద్యోగి పాత్రలో నటిస్తున్నారు. ఆద్యంతం వినోదభరితంగా ఈ సినిమా రూపొందబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa