బిగ్ బాస్ సెలబ్రిటీ సోహెల్ రియాన్ రీసెంట్గానే "లక్కీ లక్ష్మణ్" గా ప్రేక్షకులను పలకరించి, వారి మెప్పును పొందాడు. తాజాగా ఈసారి 'ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.
SV కృష్ణారెడ్డి దర్శకత్వంలో సోహెల్ రియాన్, మృణాళిని రవి జంటగా నటిస్తున్న ఈ సినిమా యొక్క విడుదల తేదీపై మేకర్స్ తాజాగా సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా మార్చి 3న విడుదల కాబోతుందని పేర్కొంటూ అఫీషియల్ రిలీజ్ పోస్టర్ విడుదల చేసారు.
ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, మీనా, కృష్ణ భగవాన్, సన, ప్రవీణ్, సప్తగిరి, అజయ్ ఘోష్, రాజా రవీంద్ర, సురేఖ వాణి తదితర సినీ ప్రముఖులు నటిస్తున్నారు. కే అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్ బ్యానర్ పై కోనేరు కల్పన ఈ చిత్రాన్ని నిర్మించారు.