గ్లోబల్ సెన్సేషన్ RRR లోని నాటు నాటు పాట ప్రపంచం మొత్తాన్ని ఏకత్రాటిపైకి తీసుకువచ్చి, అందరి చేత అదే ఊపు, ఉత్సాహంతో స్టెప్పులు వేయిస్తుంది. ప్రస్తుతం మన ఇండియాలో కన్నా ప్రపంచదేశాలతో RRR హవా ఒక రేంజులో ఉంది. అదీకాక నాటు నాటు పాటకు ఆస్కార్ నామినేషన్ కూడా అందడంతో, ప్రతి ఒక్కరి దృష్టిని ఈ సాంగ్ తనవైపుకు ఆకర్షిస్తుంది.
తాజాగా కొరియన్ ఎంబసీ ఇండియా స్టాఫ్ తో కలిసి కొరియన్ అంబాసడర్ చాంగ్ జె బోక్ నాటు నాటు కవర్ సాంగ్ కి స్టెప్పులేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఈ వీడియోపై దేశప్రధాని స్పందించడం మరొక విశేషం. లైవ్లీ.. అడారబుల్ టీం ఎఫర్ట్ .. అంటూ మోడీ ట్వీట్ చేసారు.