హాస్యనటుడు, కథానాయకుడు ఇటీవల విలన్గా కూడా నటించి ప్రేక్షకులను అలరిస్తున్న సునీల్ నుండి కొత్త సినిమా ప్రకటన జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఈ మూవీ యొక్క టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలయ్యింది. "భువనవిజయమ్" టైటిల్ తో రాబోతున్న రచయితల కథ ఇది. యలమంద చరణ్ రచించి, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సునీల్ తో పాటుగా వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డి, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, ధనరాజ్, హర్ష చెముడు, గోపరాజు రమణ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. శ్రీమతి లక్ష్మి సమర్పణలో హిమాలయ స్టూడియో మ్యాన్షన్స్, మిర్త్ మీడియా సంయుక్త బ్యానర్ లపై కిరణ్ మరియు VSK నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.