కార్తీక్ దండు డైరెక్షన్లో మెగా హీరో సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా నటిస్తున్న చిత్రం "విరూపాక్ష". టైటిల్ గ్లిమ్స్ రీసెంట్గానే విడుదలై, ఆడియన్స్ అటెన్షన్ ను గ్రాస్ప్ చేసింది. విరూపాక్ష మూవీ తో పాన్ ఇండియా బరిలోకి అడుగుపెట్టబోతున్నారు హీరో సాయిధరమ్ తేజ్. అజనీష్ లోక్ నాధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో ఏప్రిల్ 21, 2023లో విడుదల కాబోతుంది.
తాజాగా విరూపాక్ష టీజర్ విడుదల పై మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు మార్చి 1న విరూపాక్ష టీజర్ విడుదల కాబోతుందని మేకర్స్ చిన్న గ్లిమ్స్ వీడియోతో అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.