R. చంద్రు దర్శకత్వంలో రూపొందుతున్న "కబ్జా" చిత్రంలో ఉపేంద్ర, కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రేయా శరణ్ కీరోల్ లో నటిస్తుంది. రవి బసృర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన రెండు లిరికల్ సాంగ్స్ కి ఆడియన్స్ నుండి చాలా మంచి స్పందన వస్తుండగా, తాజాగా ఈ రోజు రాత్రి ఏడు గంటలకు థర్డ్ సింగిల్ గా మాంఛి సెలెబ్రేషన్ సాంగ్ విడుదల కాబోతుంది. మార్చి 17వ తేదీన గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను తెలుగులో హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు.