కన్నడ చిత్రపరిశ్రమ నుండి రాబోతున్న మరొక ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ "కబ్జా". R చంద్రు దర్శకనిర్మాణంలో ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శ్రేయా శరణ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తుంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
తాజాగా కబ్జా చిత్రబృందానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు శుభాకాంక్షలు తెలియచేసినట్టుగా తెలుస్తుంది. నిన్న జరిగిన కబ్జా థర్డ్ సింగిల్ లాంచ్ ఈవెంట్ కార్యక్రమంలో ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు చంద్రు అధికారికంగా తెలిపారు. పవన్ కళ్యాణ్ అప్రిసియేషన్ నోట్ ని ప్రొజెక్టర్ పై డిస్ప్లే కూడా చేసారు. దీంతో అక్కడ ఉత్సాహకరమైన వాతావరణం నెలకొంది.
ఐతే, పవన్ కళ్యాణ్ నుండి అసలు ఇలాంటి నోట్ ఒకటి విడుదలయ్యిందని ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆయన సోషల్ మీడియా ఖాతాలో ఈ నోట్ పోస్ట్ చెయ్యలేదు. వ్యక్తిగతంగా చిత్రబృందానికి పవన్ విషెస్ తెలియచేసినట్టుగా తెలుస్తుంది.