ఆలియా భట్.. బాలీవుడ్ లో ప్రజెంట్ సెన్సేషన్. స్టార్ హీరోయిన్లలో నంబర్ వన్ ప్లేస్ లో ఉన్న బ్యూటీ. కేవలం బ్యూటీయే కాదు బ్యూటీ విత్ గ్రేస్.. బ్యూటీ విత్ టాలెంట్ ఉన్న భామ. మహేశ్ భట్ తనయగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంది.వరుస సినిమాలు చేస్తూ తనలోని నటిని మెరుగు పరుచుకుంటోంది. బ్రహ్మాస్త్ర, గంగూభాయి కాటియావాడి సినిమాలతో సూపర్ స్టార్ డమ్ సొంతం చేసుకుంది. ఈ భామ సోషల్ మీడియాలోనూ సెన్సేషనే. ఎప్పటికప్పుడు తన సినిమాలు, పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటూ అభిమానులతో టచ్ లో ఉంటుంది.తాజాగా ఆలియా భట్ తన సోషల్ మీడియాలో కొత్త ఫొటోలు షేర్ చేసింది. గ్రీన్ కలర్ డ్రెస్ లో మెడలో డైమండ్ నెక్లెస్ ధరించి చాలా సింపుల్ గా కనిపించింది. సింపుల్ ఔట్ ఫిట్ లోనూ ఆలియా తన బ్యూటీతో నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది.
Alia Bhatt looks breathtakingly beautiful in an olive green gown#AliaBhatt pic.twitter.com/8Pm62Mw4Pg
— VD bulletin (@vdbulletin) February 27, 2023