సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. మలయాళ యువ దర్శకుడు జోసెఫ్ మను జేమ్స్(31) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జోసెఫ్ కేరళలోని ఓ ఆస్పత్రిలో హెపటైటిస్ కు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాగా మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోని పలు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. 'నాన్సీ రాణి' సినిమాతో పూర్తిస్థాయిలో దర్శకుడిగా మారిన జోసెఫ్ ఆ సినిమా విడుదలకు ముందే మరణించారు.