ఈ ఏడాది "హంట్" మూవీతో ప్రేక్షకులను పలకరించి, ఘోర పరాజయం అందుకున్న నైట్రో స్టార్ సుధీర్ బాబు నటిస్తున్న కొత్త చిత్రం "మామా మశ్చీంద్ర". నటుడు, అమృతం ఫేమ్ హర్షవర్ధన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మిర్నాళిని రవి హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో విడుదలైన ఫస్ట్ లుక్, గ్లిమ్స్ వీడియోలో సుధీర్ బాబు సిక్స్ ప్యాక్ తో సూపర్ ఫిట్ గా కనిపించారు. ఐతే, తాజాగా ఈ మూవీ నుండి సుధీర్ బాబు లుక్ కి సంబంధించి చిన్న వీడియో లీక్ అయ్యింది. ఇందులో సుధీర్ బాబును చూసి షాక్ అవ్వడం ఖాయం. ఎందుకంటే ఇప్పటివరకు ఫిట్టెస్ట్ అవతార్ లో ఉన్న సుధీర్ ను మనం చూడగా, తాజాగా ఈ లీక్డ్ వీడియోలో ఊబకాయంలో కనిపిస్తున్నారు. దాదాపు 150కేజీల భారీ కాయంతో, డిఫరెంట్ మేకోవర్ తో సుధీర్ బాబు ని చూసిన వారందరికీ ఈ సినిమాలో సుధీర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడా అని ఆశ్చర్యపోతున్నారు. మరి, ఇందుకు సంబంధించిన అధికారిక వివరాలు చిత్రబృందం నుండి అతి త్వరలోనే రానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa