ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటిస్తున్న "బలగం" మూవీ ట్రైలర్ రెండ్రోజుల క్రితం విడుదల కాగా, ఇప్పుడు ఆ ట్రైలర్ యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోస్ లో ఒకటిగా దూసుకుపోతుంది. వేణు టిల్లు దర్శకత్వంలో ఫీల్ గుడ్ ఎమోషనల్ విలేజ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా యొక్క ట్రైలర్ కి ఆడియన్స్ నుండి హార్ట్ టచింగ్ రెస్పాన్స్ వస్తుండడంతో, సినిమాపై ఒక్కసారిగా అంచనాలు మొదలయ్యాయి.
దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. శిరీష్ సమర్పిస్తున్నారు. మరి, ఈ శుక్రవారమే బలగం మూవీ థియేటర్లకు రాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa