టాలీవుడ్ జేజమ్మ అనుష్కశెట్టి న్యూ మూవీ యొక్క టైటిల్ ఎనౌన్స్మెంట్ కి మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేసారు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు అనుష్క 48 కర్టెన్ రైజర్ జరుగుతుందని పేర్కొంటూ స్పెషల్ పోస్టర్ ను మేకర్స్ కాసేపటి క్రితమే విడుదల చేసారు. ఒక పింగాణీ ప్లేట్ మీద మైక్ పెట్టి ఉన్నఈ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తుంది.
ఈ సినిమాలో అనుష్కతో పాటుగా నవీన్ పోలిశెట్టి కూడా నటిస్తున్నారు. పి మహేష్ బాబు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. రధన్ సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థలో ప్రొడక్షన్ నెంబర్ 14 గా ఈ సినిమా తెరకెక్కుతుంది.