కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర గారి భార్య ప్రియాంక ఉపేంద్ర నుండి రాబోతున్న 50వ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదలయ్యింది. ఈ సినిమాలో 'డిటెక్టివ్ తీక్షణ' పాత్రలో ప్రియాంక నటిస్తున్నారు. టైటిల్ కూడా అదే. డిటెక్టివ్ తీక్షణ గా ప్రియాంక స్ట్రైకింగ్ లుక్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది.
ఈ సినిమాను త్రివిక్రమ్ రఘు డైరెక్ట్ చేస్తున్నారు. SDC సినీ క్రియేషన్స్, ఈవెంట్ లింక్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్త బ్యానర్లపై జి ముని ప్రసన్న, జి ముని వెంకట్ చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ప్రియాంకే సమర్పిస్తున్నారు. విశేషమేంటంటే, ప్రియాంక కెరీర్ లో 50వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, బెంగాలీ, హిందీ, ఒరియా వంటి మొత్తం 7 భాషల్లో విడుదల కాబోతుంది.