బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే కలిసి నటిస్తున్న చిత్రం "కిసీ కా భాయ్ కిసీ కీ జాన్". కాసేపటి క్రితమే ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ 'బిల్లి బిల్లి' టీజర్ విడుదలయ్యింది. బిల్లి బిల్లి ఆంఖే గోరియే .. అని సాగే ఈ పాటను సింగర్ సుఖ్ బీర్ సింగ్ ఆలపించారు. ప్రస్తుతం ఈ సాంగ్ టీజర్ ఐతే, సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. ఫుల్ సాంగ్ రేపు విడుదల కాబోతుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు కి రీమేక్ అని పేర్కొనబడుతున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, జగపతి బాబు కీరోల్స్ లో నటిస్తున్నారు. ఈ ఏడాది ఈద్ కానుకగా విడుదల కాబోతుంది.