యంగ్ హీరో సంతోష్ శోభన్ ఈ ఏడాది 'కళ్యాణం కమనీయం', 'శ్రీదేవి శోభన్ బాబు' వంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్లతో ప్రేక్షకులను పలకరించారు. తాజాగా ఆయన నటిస్తున్న మరొక సినిమా కూడా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు ఈ న్యూ మూవీ యొక్క టీజర్ ను మేకర్స్ మార్చి 4వ తేదీన విడుదల చెయ్యబోతున్నట్టుగా కాసేపటి క్రితమే స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు.
ఇంతకూ ఆ సినిమా పేరు ఏంటంటే 'అన్నీ మంచి శకునములే'. ఇందులో మాళవికా నాయర్ హీరోయిన్ గా నటిస్తుంది. నందినిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.