శ్రీవిష్ణు పుట్టినరోజు సందర్భంగా నిన్న విడుదలైన సామజవరగమన స్పెషల్ బర్త్ డే గ్లిమ్స్ ఆద్యంతం వినోదభరితంగా సాగింది. ఈ గ్లిమ్స్ వీడియోతో ఆడియన్స్ లో అంచనాలు మొదలయ్యాయి. తాజాగా ఈ గ్లిమ్స్ వీడియో వన్ మిలియన్ వీక్షణలను అందుకుని, మరింత ఎక్కువమంది ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.
'వివాహ భోజనంబు' ఫేమ్ రామ్ అబ్బరాజు ఈ సినిమాకు దర్శకుడు కాగా హాస్య మూవీస్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రాజేష్ దందా నిర్మిస్తున్నారు. అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.