కోలీవుడ్ లో మోస్ట్ యాంబీషియస్ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న పొన్నియిన్ సెల్వన్ చిత్రం యొక్క రెండవ భాగం ఈ ఏడాది ఏప్రిల్ 28వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుందని మేకర్స్ గతంలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. కానీ, గత కొన్ని రోజులుగా PS 2 వాయిదా పడబోతుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలకు చెక్ పెడుతూ.. తాజాగా మేకర్స్ నుండి విడుదల తేదీపై అఫీషియల్ అండ్ సాలిడ్ క్లారిటీ వచ్చింది.
PS 2 బిహైండ్ ది సీన్స్ కి సంబంధించిన చిన్న గ్లిమ్స్ వీడియోని విడుదల చేసి, ఏప్రిల్ 28వ తేదీన పాన్ ఇండియా భాషల ప్రేక్షకుల ముందుకు రాబోతుందని మరొకసారి విడుదల తేదీపై మేకర్స్ సాలిడ్ క్లారిటీ ఇచ్చారు.