ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన పుష్ప ది రైజ్ పాన్ ఇండియా భాషల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో పుష్ప 2 పై పాన్ ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పుష్ప 2 ని మేకర్స్ చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు.
ఇటీవలే వైజాగ్ లో పుష్ప 2 షెడ్యూల్ పూర్తి కాగా, తాజాగా హైదరాబాద్ లో ఈ రోజు నుండే మరొక షెడ్యూల్ ప్రారంభం అయ్యింది. ఈ షెడ్యూల్ లో షెకావత్ సార్ అదేనండి మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ కూడా పాల్గొంటున్నారట.
పుష్ప 1 లో షెకావత్ సర్ గా డిఫరెంట్ విలనిజాన్ని ప్రదర్శించి, తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఫాహద్ ఫాజిల్ హీరోయిన్ నజ్రియా భర్త అన్న విషయం తెలిసిందే
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa