నటసింహం నందమూరి బాలకృష్ణ గారు సంక్రాంతికి వీరసింహారెడ్డిగా ప్రేక్షకులను పలకరించి, వారి నుండి అద్భుతమైన స్పందనను అందుకున్నారు. బాలయ్య కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లను, బెస్ట్ ఓవర్సీస్ కలెక్షన్లను అందుకున్న సినిమాగా వీరసింహారెడ్డి ప్రత్యేకంగా నిలిచింది. బాలయ్యకు ఇంతటి మెమొరబుల్ మూవీని అందించిన దర్శకుడు గోపీచంద్ మలినేని.
తాజాగా ఈ రోజుతో వీరసింహారెడ్డి విజయవంతంగా 50 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఒక ఎమోషనల్ పోస్ట్ ను ట్విట్టర్ లో షేర్ చేసారు. 50రోజుల వీరసింహారెడ్డి... మరిచిపోలేని అనుభవం, లెక్కపెట్టలేని జ్ఞాపకాలు, తీర్చలేని ఋణం.. బాలయ్యని డైరెక్ట్ చేసి, వీరమాస్ బ్లాక్ బస్టర్ కొట్టడం అంటే.. నిజంగా కల నిజమవ్వడమే ..కృతజ్ఞతలు సార్.. అంటూ గోపీచంద్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.