ఇప్పటివరకు విడుదలైన లిరికల్ సాంగ్స్ తో శ్రోతలను మైమరిపిస్తున్న రంగమార్తాండ చిత్రం నుండి ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు రంగస్థలాన రంగమార్తాండుడివే అయినా.. అనే సోల్ ఫుల్ సాంగ్ విడుదల కాబోతుంది. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా స్వరకల్పనలో రూపొందిన ఈ చిత్రంలోని గీతాలు మెలోడీ ప్రియులను ఉర్రూతలూగిస్తున్నాయి.
ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకుడు కాగా, కాలిపు మధు, ఎస్ వెంకట్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్ బాలకృష్ణన్, రాహుల్ సిప్లిగంజ్ ప్రధాన తారాగణం.