నటుడు దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక పూజా కార్యక్రమం ఫిబ్రవరీలోనే జరిగింది. ఆ రోజు నుండే రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది ఈ సినిమా.
తాజా సమాచారం ప్రకారం, ఈ నెలంతా కూడా పవన్ PKSDT సెట్స్ లోనే గడుపుతారట. ఈ సినిమాలో తన పాత్ర చిత్రీకరణను ఎలాగైనా ఈ నెలలోనే పూర్తి చెయ్యాలని పవన్ షెడ్యూల్ ప్లాన్ చేశారట. ఇక, ఈ నెల్లో మరే సినిమాకు డీవియేట్ అవ్వకుండా కేవలం ఈ సినిమా చిత్రీకరణంతోనే పవన్ గడుపుతారు. తదుపరి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్ లో జాయిన్ అవుతారు.